ADVT
హజ్ హౌస్,బస్సులకే కాదు మరుగుదొడ్లకూ కాషాయరంగే...
12-01-2018 06:52:31
ఆగ్రా : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అధికారంలోకి రావడంతో అతని అనుచరులైన హిందూత్వవాదులు మొత్తం రాష్ట్రాన్ని కాషాయికరిస్తున్నారు. లక్నో నగరంలోని హజ్ హౌస్, యూపీ సర్కారు బస్సులే కాకుండా మరుగుదొడ్లకు కూడా కాషాయరంగును వేస్తున్నారు. కాషాయరంగు అంటే ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ కు ఎంతో ఇష్టమని తెలుసుకున్న అతని అనుంగు అనుచరులు అన్ని భవనాలే కాదు మరుగుదొడ్లకూ కూడా కాషాయరంగు వేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ఇటావా అమృతపూర్ గ్రామంలో 350 మరుగుదొడ్లను సర్కారు నిర్మించింది. మరుగుదొడ్లకు కాషాయ రంగు వేయాలని గ్రామపంచాయితీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆ గ్రామ ప్రధాన్ వేదపాల్ చెప్పారు. పంచాయితీ తీర్మానం మేర గ్రామంలోని మరుగుదొడ్లకు కాషాయరంగు వేశారు. ముఖ్యమంత్రి యోగికి నచ్చిన రంగును మరుగుదొడ్లకు వేస్తే తమ గ్రామానికి అధిక నిధులు వస్తాయని సర్పంచి వేదపాల్ వివరించారు.
Tags : cm yogi, Toilets, BJP, saffronisation

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.