హజ్‌ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు: డిప్యూటీ సీఎం
12-01-2018 06:48:46
హైదరాబాద్/నాంపల్లి (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఏటా హజ్‌ యాత్రికుల కోటాను పెంచేందుకు ప్రభుత్వపరంగా ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ కేంద్ర హజ్‌ కమిటీ దృష్టికి తీసుకువస్తారన్నారు. గురువారం నాంపల్లిలోని హజ్‌ భవన్‌ ప్రాంగణంలో రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు వెళ్లేవారి కోసం లక్కీడ్రా తీసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గతేడాది తరహాలోనే ఈసారి హజ్‌ యాత్రికులకు మెరుగైన ఏర్పాట్లుచేస్తామని హామీఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు విడుదలచేసిందని అన్నారు.
 
          మైనారిటీల సమాగ్రాభ్యున్నతికి, వారి సంక్షేమానికి కేసీఆర్‌ చేస్తున్న కృషిని, వివిధ పథకాల వల్ల అనేకమంది లబ్ధిపొందుతున్నారని కొనియాడారు. రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ఆచార్య ఎస్‌కె షూకూర్‌ మాట్లాడుతూ తెలంగాణవ్యాప్తంగా ఈసారి హజ్‌యాత్రకు భక్తుల నుంచి 17,130 దరఖాస్తులు అందాయని, తెలంగాణ హజ్‌ కోటా మాత్రం 4,066 అని, 3558 డ్రా తీస్తామని వివరించారు. గ్రేటర్‌ నుంచి అధిక సంఖ్యలో గ్రేటర్‌, ప్రథమ స్థానంలో ఉండగా, చివరిలో జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లానుంచి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే.ఖాన్‌, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ మహమ్మద్‌ సలీం, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.