విజయవాడలో ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన
12-01-2018 06:47:33
విజయవాడ: భారత దర్శన్‌ ఎంటర్‌ స్టడీ టూర్‌లో భాగంగా 2017 బ్యాచ్‌కి చెందిన 18 మంది సభ్యుల ట్రైనీ ఐఏఎస్‌ల బృందం గురువారం విజయవాడ నగరానికి వచ్చి నగర కమిషనర్‌ జె.నివాస్‌ను కలుసుకున్నది. ఈ సందర్భంగా కమిషనర్‌ నగరంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వారికి వివరించారు. తరువాత బృందంతో కలసి రామలింగేశ్వరనగర్‌లోని సూయిజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, సోలార్‌ సిస్టమ్‌, చెత్త సెగ్రిగేషన్‌ విధానం, ఏపీఐఐసీ కాలనీలోని ఆన్‌సైట్‌ కంపోస్ట్‌ యూనిట్‌ పనితీరును, మొగల్రాజపు రంలోని బీఎస్‌ఆర్‌కే హైస్కూలులోని మురుగు రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆన్‌సైట్‌ కంపోస్ట్‌ యూనిట్‌ ద్వారా నగరంలోని చెత్త సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారో కమిషనర్‌ ఆ బృందానికి వివరించారు. తరువాత బీఎస్‌ఆర్‌కే హైస్కూల్‌లోని విద్యార్థులతో బోధన విధానం, తదితర అంశాలను ఈ బృందం చర్చించి, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎఎస్‌ఎన్‌ ప్రసాద్‌, బాబు శ్రీనివాసన్‌, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.