21న బీసీ న్యాయవాదుల సమావేశం
12-01-2018 06:37:37
గుంటూరు: ఈ నెల 21న అంధ్రప్రదేశ్‌ బీసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ 13 జిల్లాల అధ్యక్ష, ప్రదాన కార్యదర్శుల సమావేశం గుంటూరు అరండల్‌పేట 4వ లైనులోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జరుగుతుందని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లపు కృష్ణ తెలిపారు. అసోసియేషన్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయవాదులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేదన్నారు. న్యాయవాదుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దూళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కె వీరభాస్కర్‌, నాయకులు సంపత్‌ రామకృష్ణ, పి.దాసు, న్యాయవాదులు పాల్గొన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.