ప్లాట్‌ ఇప్పిస్తానని మోసం చేసి దొరికిపోయాడు
12-01-2018 06:23:30
హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి):విశాఖపట్నంలో ప్లాట్‌ ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 15 లక్షల కాజేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రారెడ్డి అనే వ్యక్తి 2009 లో హైదరాబాద్‌లో టీవీ ఆర్టిస్టుగా పని చేస్తూ గుంటూరుకు చెందిన గణేశ్‌కు పరిచయమయ్యాడు. విశాఖ రామానాయుడు స్టూడియో వద్ద 610 చదరపు గజాల స్థలం అమ్మకానికి ఉందని 15 లక్షల రూపాయలకు కొనుగోలు చేయవచ్చని గణేశ్‌ బాధితుడిని నమ్మించాడు.
 
         అతడి మాటలు నమ్మిన రామచంద్రారెడ్డి ఓసారి రూ. 2,80,000, మరోసారి రూ. 12,50,000 ఇలా మొత్తం కలిపి 15లక్షల 30వేల రూపాయలు నిందితుడు చెప్పిన అకౌంట్‌లలో జమ చేశాడు. ఆ తర్వాత ప్లాట్‌ ఇవ్వకపోగా అతడిని కలవకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్లాట్‌ గురించి ఆరా తీయగా అసలు అక్కడ స్థలమే లేదన్న విషయం తెలుసుకుని మోసపోయానని గ్రహించాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరగా అతడు ఇవ్వకపోగా బెదిరించాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా... కేసు దర్యాప్తు చేయమని సీసీఎస్‌ను ఆదేశించింది. ఏడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న గణేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.