ఏపీ మంత్రి దేవినేని ఉమ వల్ల ప్రాణ భయం
12-01-2018 06:17:58
రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ
హైదరాబాద్/బంజారాహిల్స్‌ (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పోలీసుల అధికారులవల్ల ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం.. ప్రకారం యూసు్‌ఫగూడ తిరుమల అపార్ట్‌మెంట్‌, ఫ్లాట్‌ నెంబరు 311లో నివసిస్తున్న అట్లూరి ప్రవిజకు మంత్రి దేవినేని ఉమ మధ్య ఓ స్థలం విషయంలో వివాదం నెలకొంది. ప్రవిజ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావు పేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.
 
                 కేసును విత్‌డ్రా చేసుకోవాలని తనపై మంత్రి దగ్గర ఉంటున్న పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రవిజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది జనవరి 4వ తేదీన తనను కిడ్నాప్‌ చేసి మంత్రి ఇంట్లో నిర్బంధించారని.. దీనిపై కేసు నమోదు కాగా దర్యాప్తు అధికారులు కొట్టేశారని చెప్పారు.తాజాగా కొంతమంది పోలీసు అధికారులు తన ఆచూకీ కోసం వెతుకుతున్నారని.. ఏ సమయంలో అయినా కిడ్నాప్‌ చేసి చంపే అవకాశాలు ఉన్నాయన్నారు. తనకు ప్రాణహాని ఉన్నందును రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి జీడీ ఎంట్రీ పెట్టినట్టు బంజారాహిల్స్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.