అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్ మరోసారి మారనుంది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 13 వరకు, దరఖాస్తులు పంపించేందుకు ఈ నెల 17 వరకు గడువు ఉంది. అయితే 2016-18 బ్యాచ్ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, బీటెక్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడంతో ఈ మేరకు ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అలాగే డిగ్రీలో క్వాలిఫైయింగ్ మార్కులను తగ్గించాలన్న వినతులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్ మరోసారి మారే అవకాశం ఉంది.