ADVT
నాకు ఓయూ విద్యార్థులు కొండంత బలం...కత్తి మహేష్ వ్యాఖ్యలు
12-01-2018 06:02:47
హైదరాబాద్ : ప్రజాస్వామిక పోరాటాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జేఏసీ నేతలు, విద్యార్థులు తనకు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని కత్తి మహేష్‌ అన్నారు. గురువారం ఓయూ జేఏసీ నేతలు ఆహ్వానం మేరకు యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలకు కత్తి మహేష్‌ వచ్చారు. ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ అని, తనకు ఇంతమంది సపోర్టుగా రావడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. ఓయూ జేఏసీ నేతలు వరంగల్‌ రవి, డేవిడ్‌, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ వ్యక్తి కత్తి మహేష్‌ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని తెలిపారు.
Tags : katti mahesh, osmania university, tjac

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.