ఆదిలాబాద్‌లో 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
12-01-2018 05:56:19
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో గురువారం నాటి రాత్రి ఉష్ణోగ్రత 8 డిగ్రీల మేర నమోదైంది. రాష్ట్రంలో పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మంలలో 4 డిగ్రీలు, రామగుండంలో 3 డిగ్రీలు, మెదక్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీలు, హైదరాబాద్‌, నిజామాబాద్‌లో ఒక డిగ్రీ మేరకు సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.