తెలంగాణ నుంచి 84 మంది ఏపీ పోలీసుల రిలీవ్‌
12-01-2018 05:50:32
హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పరస్పర అవగాహనతో తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న 84మంది ఆంధ్రప్రదేశ్‌ సిబ్బందిని రిలీవ్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన కొంతమంది సిబ్బంది తెలంగాణలో, ఇక్కడివారు కొంతమంది ఏపీ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. పరస్పర అవగాహనపై స్వరాష్ట్రాలకు పంపించాల్సిందిగా సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ నుంచి ఆపై స్థాయిలో తెలంగాణ పోలీసుశాఖలో పనిచేస్తున్న 84మంది ఏపీ సిబ్బందిని రిలీవ్‌ చేసింది. అలాగే ఏపీలో పనిచేస్తున్న 90మంది తెలంగాణ పోలీసు సిబ్బంది ఇక్కడకు త్వరలో బదిలీ కానున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.