వెలిగే దీపం విశ్వాసి జీవితం
11-01-2018 22:59:23
‘అయితే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందాడు’ అంటుంది బైబిల్‌.
క్రైస్తవానికి పునాదిగా పేర్కొనదగిన ‘కృప’ అనే మాట మొదటిసారిగా బైబిల్‌లో ఈ సందర్భంలో వాడారు. ‘నోవాహు’ అంటే విశ్రాంతి అని అర్థం. వాస్తవానికి శారీరకంగా నోవాహు అవిశ్రాంతంగా జీవించాడు. తొలి మానవులైన ఆదాము, అవ్వల తర్వాత కొన్ని తరాలకే స్వతంత్రంగా, విచ్చలవిడిగా, అనైతికంగా జీవిస్తూ లోకాన్ని పాపమయం చేసిన మానవాళి నిండా భూమిపైనున్న ఇతర జీవులన్నింటితో సహా సమూ లంగా నాశనం చేసి, ప్రక్షాళన చేసి అంతా సరికొత్తగా ఆరంభిం చాలనుకున్న దేవునికి కొత్త మానవాళి కోసం ‘విత్తనం’గా నోవాహు కుటుంబమొక్కటే సరైనదిగా కనిపిం చింది. అందువల్ల భూమినంతా తుడిచిపెట్టేందుకు 40 పగళ్లు, రాత్రుళ్లు తాను పంపబోయే ‘జలప్రళయం’ నుంచి ప్రాణాలతో బతికేందుకుగాను నోవాహు, కుటుంబంతో పాటు జీవచరాలన్నీ తలదాచుకునేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించాలని దేవుడు ఆదేశించాడు. ఓడ పూర్తయున తర్వాత దేవుడు జీవ చరాలన్నిటినీ ఓడలోకి పంపగా, వాటితో పాటు నోవాహు కుటుంబం కూడా అందులోకి వెళ్లగానే, ఓడ తలుపుల్ని మూసేసి జల ప్రళయాన్ని పంపగా లోకమంతా ప్రక్షాళనయింది. శారీరకంగా అలసిపోయినా మానసి కంగా విశ్రాంతి కలిగి ఉండటమే నిజమైన విశ్రాంతి. శరీరం ఒక అద్భుతమైన యంత్రం. అది ఎంత పనిచేస్తే అంత ఆరోగ్యంగా, సమస్యారహితంగా నడుస్తుంది. కానీ ఒత్తిళ్లు, ప్రతికూలతలు, సవాళ్లు లేని జీవితాన్ని మనసు కోరుకుంటుంది. అది నిరంతరమైన ధ్యానంతోనే సాధ్యమవుతుంది.
 సుశీల్‌ సందేశ్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.