ADVT
గజానికో మద గజం
04-01-2018 03:47:19
  • చాన్స్‌ కావాలంటే చాన్సివ్వాల్సిందే!
ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై నటి అలిసా మిలానో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. సామాజిక కార్యకర్త తరానా బర్కేతో కలిసి ఆమె ‘మీ టూ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. వారి స్ఫూర్తితో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎందరో తారలు ఽమీడియా ముందుకు వచ్చి..వీన్‌ స్టీన్‌ బండారం బయటపెట్టారు. హార్వే వీన్‌స్టీన్‌పై డజన్ల లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు లాస్‌ఏంజెలిన్‌ కోర్టులో విచారణకు వచ్చాయి. వందలాది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని పాశ్చాత్య మీడియాలో ఆయనపై కథనాలు వెలువడ్డాయి. ‘వీన్‌స్టీన్‌ నామీద పడ్డాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. కానీ వాడో పంది. నన్ను రేప్‌ చేశాడు’ అంటూ హాలీవుడ్‌ నటి..డి లా హ్యుర్టా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ని కూడా వీన్‌స్టీన్‌ వేధించాడని ఇటీవల ఆమె పూర్వ మేనేజర్‌ షిఫీల్డ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హాలీవుడ్‌ నటుడు స్పేసీ, హాస్యనటుడు లూయిస్‌ సీకే కూడా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.