ADVT
ఎక్కడో చెయ్యి వేస్తాడు అప్పటి అధ్యక్షుడు
04-01-2018 03:45:37
అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్‌ బుష్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఏడుగురు మహిళలు ఆరోపించారు. ఆయనతో ఫొటో తీయించుకునే సమయంలో తమ పిరుదులను తడిమారని మీడియాకి వెల్లడించారు. సీనియర్‌ బుష్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి హెదర్‌ లిండ్‌ తొలుత ఆరోపించారు. గత ఏడాది హ్యూస్టన్‌లో జరిగిన ఓ టెలివిజన్‌ సిరీస్‌ స్ర్కీనింగ్‌లో..బు్‌షతో కలిసి ఫోటో తీయించుకున్న సమయంలో..ఆయన తనను వెనుక నుంచి తడిమారనీ, ఓ డర్టీ జోక్‌ కూడా వేశారని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్‌ అమెరికన్లను షాక్‌కు గురిచేసింది. జోర్డానా గ్రోల్‌నిక్‌ అనే నటి కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. పదహారేళ్ల వయసులో బుష్‌తో ఫోటో తీయించుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన అసభ్యంగా ప్రవర్తించారని రోస్లిన్‌ కారిగాన్‌ అనే మహిళ పత్రికలకు వెల్లడించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.