ADVT
పెరగనున్న చలి
04-01-2018 03:17:19
విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తర, మధ్య భారతంలో తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. ఉత్తర దిశగా వస్తున్న చలిగాలులు తెలంగాణ, కోస్తా వరకు వీస్తున్నాయి. దీంతో బుధవారం తెలంగాణ, ఉత్తరకోస్తాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చలి వాతావరణం రెండు, మూడు రోజులు కొనసాగుతుందని పేర్కొంది. కాగా దక్షిణ అండమాన్‌, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల ఆరవ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ర్టాల్లో వచ్చే 24 గంటల్లో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.