31న శ్రీవారి ఆలయం మూసివేత
04-01-2018 03:16:53
తిరుమల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈనెల 31న తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 12గంటల పాటు మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 గంటల వరకు గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం ప్రారంభ సమయానికి 8గంటల ముందుగానే ఆలయ ద్వారాలకు తాళాలు వేస్తారు. దాదాపుగా ఆ రోజంతా స్వామి దర్శనం ఉండదు. గ్రహణం వీడిన అనంతరం ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, పుణ్యాహవచనం తదితర శాస్త్రోక్త పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 10గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వేకువజామున సుప్రభాతం, తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం సేవలు యథావిధిగా నిర్వహిస్తారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.