గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకే
04-01-2018 03:15:03
  • దీనికోసం ఏపీకి నిధులివ్వలేదు: కేంద్రం
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని 2017 జూన్‌ 2నుంచే తెలంగాణకు పూర్తిగా అప్పగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని తెలిపింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ ఆహిర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ సిబ్బంది కేటాయింపు పూర్తయినట్లు పేర్కొన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.