రానున్న ఎనిమిది నెలలే కీలకం
04-01-2018 03:02:55
  •  సీఎం నమ్మకాన్ని నిలబెట్టాలి.. ఇరిగేషన్‌ ఇంజనీర్లతో హరీశ్‌
హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : రానున్న ఎనిమిది నెలల కాలం సాగునీటి పారుదల శాఖకు అత్యంత కీలకమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జలసౌధలో బుధవారం తెలంగాణ నీటిపారుదలశాఖ-2018 క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే సాగు నీళ్లొస్తాయని ప్రజలు నమ్మారని, వారిని నిరాశకు గురి చేయొద్దన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఇంజనీరుపై ఉందన్నారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరును స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రాజెక్టుల్లోనూ వేగం పెంచాలని సూచించారు. ఇదిలా ఉండగా, దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ధర్మసాగర్‌ పంప్‌హౌ్‌సకు అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వం రూ.144 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.