జన్మభూమి మంచి కార్యక్రమం
04-01-2018 03:01:46
  • వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి
నెల్లూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి మంచి కార్యక్రమం. గ్రామసభల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లా, మండల అధికారులు గ్రామసభలకు వస్తుండటంతో సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంది. అందుకనే జన్మభూమి కార్యక్రమం మొదలైన నాటి నుంచి ముగింపు వరకు అన్ని గ్రామసభల్లో పాల్గొంటా’ అని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. నెల్లూరు నగరంలో వైసీపీ కార్పొరేటర్లు జన్మభూమిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గౌతంరెడ్డి జన్మభూమిలో పాల్గొని ఇది మంచి కార్యక్రమమని ప్రశంసించడం విశేషం.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.