మేడమ్‌... శనివారమూ రండి!
04-01-2018 02:49:52
  •  సీఎం సతీమణికి ఐఏఎ్‌సల విజ్ఞప్తి
  •  అమరావతికి రావాలని వేడుకోలు
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఇటీవల వినూత్న అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు కొత్త సంవత్సరాల వేడుకల్లో ఆమెకో విజ్ఞప్తి చేశారు. మేడమ్‌... మీరు ప్రతి శనివారం అమరావతికి రావాలని అడిగారట. ‘‘సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు... ఇలా సీఎం నిరంతరం ఏదో ఒకపనిలోనే ఉంటున్నారు. 24గంటలూ పనిచేసినా ఆయన హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం మీరొస్తున్నారు కాబట్టి ఆరోజు ఆయన కుటుంబంతో గడుపుతున్నారు. మీరు శనివారం కూడా వస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆ రోజు కనీసం సమయానికి డిన్నర్‌ చేయగలుగుతాం అని వేడుకున్నారట. హెరిటేజ్‌ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న భువనేశ్వరి వారాంతాల్లో అమరావతికి వచ్చి వెళ్తుండటంతో ఆయన ఆదివారాల్లో కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం కేటాయిస్తున్నారు. ఆదివారం ఎలాగూ విశ్రాంతి కదా... అన్న ఉద్దేశంతో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా వారు సరదాగా ఆమె దగ్గర ప్రస్తావించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.