అమెరికా గజగజ
04-01-2018 02:08:39
  •  చలికి 11 మంది మృతి
  •  మంచు తుఫాన్‌ హెచ్చరిక
ఎముకలు కొరికే చలితో అమెరికా గజగజ వణికిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చలి తీవ్రతకు 11 మంది మరణించారు. చాలా ప్రాంతాలు దట్టంగా కురిసిన మంచుతో నిండిపోయాయి. మరోవైపు గురువారం మంచు తుఫాన్‌ విరుచుకుపడుతుందన్న హెచ్చరికతో ప్రజలు భయకంపితులు అవుతున్నారు. బాంబ్‌ తుఫాన్‌గా వ్యవహరిస్తున్న ఈ తుఫాన్‌తో అమెరికా ఈశాన్య ప్రాంతంలో 6 నుంచి 12 అంగుళాల మేర మంచు పడుతుందని, గంటకు 64 నుంచి 96 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌డబ్ల్యూఎస్‌) పేర్కొంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.