ADVT
కార్గిల్‌లో మైనస్‌ 20.6 డిగ్రీలు
04-01-2018 02:07:56
న్యూఢిల్లీ, జనవరి 3: జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌లో ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఇక్కడ మైనస్‌ 20.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూ నగరంలో కూడా మంగళవారం రాత్రి రికార్డు స్థాయిలో 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం రాత్రితో పోలిస్తే ఇది 1.7 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా జమ్మూ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలు జరగలేదు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడగా, రోడ్డుమార్గంలోనూ ప్రయాణాలు సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.