ADVT
సింధు టీమ్‌కు షాక్‌
04-01-2018 01:58:07
లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌కు ఢిల్లీ డాషర్స్‌ షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో చెన్నైకి చెందిన సుమిత్‌ జోడీ మినహా కెప్టెన్‌ పీవీ సింధు సహా మిగతా షట్లర్లంతా తమ మ్యాచ్‌లు ఓడిపోయారు. ఫలితంగా ఢిల్లీ 3-0 ఆధిక్యంతో చెన్నైపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో ఢిల్లీ స్టార్‌ సంగ్‌ జీ హ్యూన్‌.. సింధును చిత్తుచేసింది. పురుషుల డబుల్స్‌లో చెన్నై జోడీ..ఢిల్లీ జంటపై నెగ్గినా, ఆ తర్వాత ట్రంప్‌ మ్యాచ్‌లో ఓడడంతో ఉన్న ఒక్క పాయింట్‌ కూడా కోల్పోయింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.