ADVT
చైనా అమ్ములపొదిలో హైపర్‌సానిక్‌ క్షిపణి
04-01-2018 01:57:51
  • భారత్‌, అమెరికాలే లక్ష్యం
బీజింగ్‌, జనవరి 3: కేవలం ఒక గంట వ్యవధిలో భారత్‌లోని లక్ష్యాలను తాకి నాశనం చేయగల కొత్త హైపర్‌సానిక్‌ క్షిపణి - డీఎఫ్‌-17 చైనా అమ్ముల పొదిలో చేరింది. నవంబరు 1న తొలిసారి, ఓ వారం తర్వాత రెండోసారి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. 2020 కల్లా దీన్ని సైన్యావసరాలకు వినియోగిస్తారని డిప్లమేట్‌ పత్రిక వెల్లడించింది. విశేషమేమంటే- ఈ హైపర్‌సానిక్‌ గ్లైడెడ్‌ వెహికల్‌ (హెచ్‌జీవీ)- అమెరికాలోని నగరాలను, జపాన్‌లోని కొన్ని కీలక ప్రాంతాలను కూడా టార్గెట్‌ చేయగలదు. మంగోలియాలోని జియాక్యువాన్‌ ప్రాంతంలో ప్రయోగ పరీక్షలు జరిగాయని, మామూలు ఖండాంతర క్షిపణుల కంటే చాలా ఎక్కువ వేగంతో, తక్కువ ఎత్తులో, నిఘా విమానాలకు అందని రీతిలో ఇవి ప్రయాణిస్తాయని, ప్రయోగ పరీక్షలో ఇవి 1400 కిలోమీటర్ల దూరం వెళ్లాయని డిప్లమాట్‌ మేగజైన్‌ కథనం పేర్కొంటోంది. ‘‘ఈ హెచ్‌జీవీ టెక్నాలజీ ప్రపంచంలోని మూడు అతిపెద్ద అణ్వస్త్ర శక్తులు- అమెరికా, రష్యా, చైనా మధ్య అణువ్యూహంలో ఎప్పుడో భాగమయ్యాయి. ఈ టెక్నాలజీ తో రూపొందిన క్షిపణి ఖచ్చితంగా భారత్‌, జపాన్‌లకు ఆందోళనకారకం. గతంలోని క్షిపణుల కంటే సూటిగా, వేగంగా ఇది లక్ష్యాలను తాకగలదు. భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా, భారత అణు కేంద్రాలు, రియాక్టర్లనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి చాలా వేగంగా వెళుతుంది. ఏ ఇంటర్‌సెప్టర్‌ మిసైల్‌ కూడా దీన్ని మధ్యలో అడ్డుకోలేదు’’ అని బీజింగ్‌లోని సైనిక విశ్లేషకుడు చౌ చెన్మింగ్‌ చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.