ADVT
నా అణు బటన్‌ మీ కంటే పెద్దది
04-01-2018 01:54:58
  • అత్యంత శక్తిమంతం.. బాగా పనిచేస్తుంది కూడా
  • కిమ్‌కు ట్రంప్‌ హెచ్చరిక.. ‘హాట్‌లైన్‌’కు ఉభయకొరియాల నిర్ణయం
వాషింగ్టన్‌, జనవరి 3: తమ అణ్వస్త్రాలు అమెరికాలో ఎక్కడైనా దాడిచేయగలవని, అణు బటన్‌ తన టేబుల్‌పై ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ జోంగ్‌-ఉన్‌ కొత్త సంవత్సరం రోజు చేసిన హెచ్చరికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. తన వద్ద ఉన్న అణు బటన్‌ కిమ్‌ కంటే పెద్దదని బుధవారం ట్విట్టర్‌లో ప్రతిహెచ్చరిక జారీచేశారు. ‘నా వద్ద కూడా బటన్‌ ఉందని, అది కిమ్‌ బటన్‌ కంటే పెద్దదని.. ఎంతో శక్తిమంతమైనదని, పైపెచ్చు చాలా బాగా పనిచేస్తుందని ఆయన ప్రభుత్వంలోని వారెవరైనా చెబితే బాగుంటుంది’ అని పేర్కొన్నారు. ఉత్తరకొరియా ప్రపంచానికే ముప్పని, ప్రపంచ దేశాలన్నీ దానిపై ఒత్తిడి తేవాలని వైట్‌హౌస్‌ పిలుపిచ్చింది. సంక్షోభ పరిష్కారానికి అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ తెలిపారు. ఇంకోవైపు.. దక్షిణకొరియాతో చర్చలకు హాట్‌లైన్‌ను పునరుద్ధరిస్తామని కిమ్‌ ప్రకటించారు. ఈ ఏడాది ప్యోంగ్‌చాంగ్‌ నగరంలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటామని కూడా వెల్లడించింది. దక్షిణ కొరియా తక్షణమే సానుకూలంగా స్పందించింది. ఉత్తరకొరియా యంత్రాంగంతో ఉన్నతస్థాయి చర్చలకు సంసిద్ధత తెలిపింది. ఇది సానుకూల పరిణామమని సారా తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలను పునరుద్ధరించకుంటే పాలస్తీనాకు ఆర్థిక సాయంలో కోత విధిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.