జడేజాకు జ్వరం.. తొలి టెస్ట్‌కు ధవన్‌ ఫిట్‌
04-01-2018 01:53:12
కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత శిబిరంలో ఒక విషయం ఆనందం నింపితే.. మరో వార్త ఆందోళన రేకెత్తిస్తోంది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు తేలగా.. ప్రధాన స్పిన్నర్‌ రవీంద్ర జడేజా వైరల్‌ జ్వరం బారిన పడ్డట్టు తెలిసింది. ఈ టూర్‌కు వచ్చేముందు చీలమండకు స్వల్ప గాయంతో ఇబ్బంది పడ్డ ధవన్‌ పూర్తిగా కోలుకున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో అతను మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్న జడేజాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాంతో అతను తొలి టెస్టులో బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది. కాగా, తొలి మ్యాచ్‌లో కోహ్లీసేన ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే గనుక.. జడేజా కంటే అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.