ADVT
ఇది కొరియా మంచు క్షిపణి
04-01-2018 01:52:37
ప్యాంగ్యాంగ్‌, జనవరి 3: క్షిపణి ప్రయోగాలతో ప్రపంచానికి- ముఖ్యంగా అమెరికాకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉత్తర కొరియా- ప్రతీ సందర్భాన్నీ అందుకోసమే ఉపయోగిస్తోంది. మొన్నటికి మొన్న- అణు బటన్‌ నా టేబుల్‌ మీదే ఉంటుందని చెప్పాడు అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఇపుడు- క్షిపణి దాడులు మొదలుపెడితే శత్రువు అంతుచూసే దాకా కొనసాగుతాయని మరోమారు చెప్పాడు. ఇంతేకాదు, దేశ ప్రజలనూ అందుకు సన్నద్ధం చేస్తున్నాడు. ఇందుకు ఓ ఉదాహరణ ఏంటంటే- ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ లో ప్రతీ కొత్త సంవత్సరం వేళా ఓ మంచు ఉత్సవం జరుగుతుంది. మంచుతో వివిధాకృతులను మలిచి అందులో ప్రదర్శనకు ఉంచుతారు. వేలాది మంది దాన్ని చూడ్డానికి వెళతారు. సాధారణంగా కొరియా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఆకృతులే ఉంటాయి. ఇపుడు -కొరియా చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి- హుయాసాంగ్‌-15ను మంచుతో మలిచి ఆ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. దీనితో అమెరికాను బుగ్గి చేయవచ్చని అంటూ సగర్వంగా దీన్ని సమర్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొంది. అనేక ఇతర క్షిపణులు, జలాంతర్గాములు, యుద్ధట్యాంకులు, ఆయుధ సామగ్రిని మంచుతో రూపొందించి ఆ శిల్పాలను ప్రదర్శిస్తున్నారు. వాటి ముందు సెల్ఫీలు దిగుతున్న ప్రజల ఫోటోలను ప్రచురించింది అధికార వార్తాపత్రిక- రొడాంగ్‌ సిన్మున్‌. అంతేకాదు... ఈ బాలిస్టిక్‌ క్షిపణితో ఓ స్మారక స్టాంపును కూడా కొరియా ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.