ADVT
కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి: జైట్లీ
04-01-2018 01:46:56
తక్షణ తలాక్‌ రద్దు బిల్లుపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం తెలిపి, రాజ్యసభలో బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా కూడా పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. తక్షణ తలాక్‌ రద్దు బిల్లును రాజ్యసభలో అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బిల్లును ఆమోదింప చేసుకునేందుకు కాంగ్రె్‌సతోసహా ఇతర పార్టీలతో మాట్లాడుతున్నామని చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.