కరుణ ఆశీస్సులందుకున్నా: రజనీ
04-01-2018 01:45:41
చెన్నై, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డీఎంకే అధినేత కరుణానిధి ఆశీస్సులందుకున్నారు. స్థానిక గోపాలపురంలోని కరుణానిఽధి నివాసానికి బుధవారం వెళ్లిన రజనీని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌ సాదరంగా స్వాగతించారు. కరుణతో పావుగంట సేపు భేటీ అయిన రజనీ.. ఆయన ఆశీస్సులు పొందారు. కరుణానిఽధికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపానని, ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నానని రజనీ విలేకరులకు తెలిపారు. తర్వాత స్టాలిన్‌ మాట్లాడుతూ రజనీ.. ఎవరి ప్రోద్బలంతోనో ఆధ్యాత్మిక రాజకీయాలంటూ ముందుకొస్తున్నారని, ద్రవిడ భూమిపై ఆధ్యాత్మిక రాజకీయాలకు తావులేదని చురక లంటించారు. కాగా, రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. ఇదిలావుంటే, రజనీ పార్టీకి నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్‌, ‘2.ఓ’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సీఈవో రాజుమహాలింగం మద్దతు ప్రకటించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.