ADVT
నౌకా దళ విమానంలో మంటలు
04-01-2018 01:44:08
రన్‌వేను దాటి వెళ్లడంతో ప్రమాదం
పణజీ, జనవరి 3: భారత నౌకా రంగానికి చెందిన మిగ్‌29కే యుద్ధ విమానంలో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. గోవా ఎయిర్‌పోర్టులో బుధవారం టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో రన్‌వేపై నుంచి కిందకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడం గమనించిన ట్రైనీ పైలట్‌ సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎమర్జన్సీ టీమ్‌ మంటలను అదుపుచేసింది. ఈ ప్రమాదం నుంచి ట్రైనీ పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో గోవా ఎయిర్‌పోర్టులో సర్వీసులను గంటపాటు నిలిపివేశారు. రష్యా తయారు చేసిన ఈ యుద్ధ విమానం ఇలా ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి.
 

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.