ADVT
‘మహా’ బంద్‌ హింసాత్మకం
04-01-2018 01:42:16
  • సిటీ బస్సులు ధ్వంసం..
  • ముంబైలో నిలిచిన లోకల్‌ రైళ్లు..
  • స్తంభించిన పౌర జీవనం.. ఆందోళన విరమణ
ముంబై/న్యూఢిల్లీ, జనవరి 3: మహారాష్ట్ర బంద్‌ హింసాత్మకంగా ముగిసింది. బుధవారం నాటి బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పౌరజీవనం స్తంభించిపోయింది. భీమా-కోరెగావ్‌ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా రెండురోజుల క్రితం నిర్వహించిన కార్యక్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, దీనికి నిరసనగా భరిపా బహుజన్‌ మహాసంఘ్‌ నాయకుడు, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు 250 దళితసంఘాలు మద్దతు తెలిపాయి. బంద్‌ సందర్భంగా ముంబైసహా పలు నగరాల్లో ఆందోళనకారులు సిటీ బస్సులను అడ్డుకుని దాడి చేశారు. దుకాణాలను ధ్వంసం చేశారు. ముంబైలో 13 బస్సులు, పుణెలో 12 బస్సులు ధ్వంసమయ్యాయి. రైల్‌రోకో నిర్వహించడంతో లోకల్‌ ట్రైన్లు నిలిచిపోయాయి. 40 వేల స్కూల్‌ బస్సులు తిరగలేదు. ట్యాక్సీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈస్ట్రన్‌ ఎక్స్‌ప్రె్‌సవే, వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రె్‌సవేలపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి ముంబై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో బుధవారం సాయంత్రం బంద్‌ను విరమిస్తున్నట్లు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రకటించారు. గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవాని, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌లు డిసెంబరు 31న పుణెలో ఆందోళనకారులను రెచ్చగొట్టేలా ప్రసంగించడమే హింసకు కారణమని ఫిర్యాదు అందినట్లు పుణె పోలీసులు తెలిపారు. మరోవైపు, మహారాష్ట్ర అల్లర్లపై పార్లమెంట్‌ ఉభయసభలూ బుధవారం అట్టుడికాయి. ఈ అం శంపై చర్చకు కాంగ్రెస్‌, బీఎస్పీ సహా ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయి దా పడ్డాయి. అల్లర్ల వెనుక ఆర్‌ఎ్‌సఎ్‌సతో పాటు కొన్ని హిందుత్వ శక్తులున్నాయని లోక్‌సభ కాంగ్రె్‌సపక్ష నేత మల్లికార్జునఖర్గే ఆరోపించారు. ఈ అంశంపై స్పందించకుండా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ వాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అగ్నికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్‌ ప్రవర్తిస్తోందని, దీనిని సహించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ అన్నా రు. రాజ్యసభలోనూ మహారాష్ట్ర అల్లర్లపై చర్చించాలని కాంగ్రెస్‌, బీఎస్పీ డిమాండ్‌ చేశాయి.
 
ఆ ఘటనలు బాధాకరం: ఆర్‌ఎస్‌ఎస్‌
మహారాష్ట్రలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు హేయం, బాధాకరమని ఆర్‌ఎ్‌సఎస్‌ పేర్కొంది. ఆర్‌ఎ్‌సఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య వాటిని తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఓ ప్రకటనలో కోరారు. కొన్ని శక్తులు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని, ప్రజలు ఆ ఉచ్చులో పడరాదన్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.