పాక్‌కు సాయమంతా ఆపేస్తాం: అమెరికా
04-01-2018 01:39:14
న్యూయార్క్‌, జనవరి 3: ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ ఆడుతున్న డబుల్‌గేమ్‌ను సహించేది లేదని అమెరికా తెగేసి చెప్పింది. ఉగ్రవాదులకు మద్దతిస్తూ వారికి ఆశ్రయమివ్వడాన్ని నిలుపుదల చేయాల్సిందేనని.. లేదంటే అన్ని రకాల సాయాన్ని ఆపేస్తామని, అధ్యక్షుడు ట్రంప్‌ ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తారని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీ హేలీ బుధవారం విస్పష్టంగా చెప్పారు. పాక్‌కు సైనిక సాయం నిలిపివేత దరిమిలా హేలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఓపక్క అమెరికాతో పాక్‌ కలిసి పనిచేస్తూనే.. ఇంకోపక్క ఆఫ్ఘనిస్థాన్‌లో మా సైనికులపై దాడిచేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోంది. ట్రంప్‌ యంత్రాంగం ఇక ఈ డబుల్‌గేమ్‌ను అంగీకరించదు’ అని తెలిపారు. కాగా.. పాక్‌ తమకు కీలక భాగస్వామి అని, అయితే ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం చేయాల్సింది చాలా ఉందని వైట్‌హౌస్‌ పునరుద్ఘాటించింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.