ADVT
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి కుమార్తె కన్నుమూత
04-01-2018 01:37:48
చెన్నై/ బెంగళూరు, జనవరి 3: అమర గాయకురాలు, భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి కుమార్తె, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్‌(84) బెంగళూరులో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తన తల్లి ఎమ్మె్‌సకు రాధా విశ్వనాథన్‌ ఐదు దశాబ్దాల పాటు గాత్ర సహకారం అందించారు. తమిళనాడులోని గోపిచెట్టి పాళయంలో 1934లో టి.సదాశివం, ఆయన మొదటి భార్య అపిత కుచంబాళ్‌ అలియాస్‌ పార్వతికి రాధ జన్మించారు. కుచంబాళ్‌ మరణానంతరం ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిని సదాశివం వివాహం చేసుకున్నారు. రాధను ఆమె సొంత తల్లిలా పెంచి పెద్దచేశారు. ఎమ్మెస్‌ పాడిన ప్రఖ్యాత కృతుల్లో ఒకటైన ‘శ్రీమన్‌ నారాయణ’ను మనవరాలు ఐశ్వర్య ఆలపిస్తుండగా, వాటిని వింటూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు వి.శ్రీనివాసన్‌ వివరించారు. రాధ అంత్యక్రియలు బుధవారం బెంగళూరులో జరిగాయి.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.