ADVT
అదే బాటలో ఐటి
04-01-2018 00:41:42
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో దేశంలోని అగ్రస్థాయి ఐటి కంపెనీల రాబడుల్లో వృద్ధి అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక అంచనా వేస్తోంది. అయితే మధ్యస్థాయి కంపెనీలు మాత్రం మెరుగైన పనితీరును కనబరచడానికి ఆస్కారం ఉందని పేర్కొంది. అమెరికా ప్రభుత్వం వీసాలకు సంబంధించి విధిస్తున్న నిబంధనలు ఐటి కంపెనీల మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. అయినప్పటికీ డిమాండ్‌, రాబడిలో వృద్ధి విషయంలో ఆశావాహ సంకేతాలు కనిపిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఉత్తర అమెరికాలో వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో అగ్రస్థాయి ఐటి కంపెనీల వృద్ధి అదే స్థాయిలో ఉండనుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. బిఎ్‌ఫఎస్‌ రంగంలో వృద్ధి లేకపోవడం, అమెరికా హెల్త్‌కేర్‌కు సంబంధించిన రెగ్యులేటరీ అంశాలు, రిటైల్‌ వెర్టికల్‌లో సవాళ్ల ఫలితంగా 2017 క్యాలెండర్‌ సంవత్సరంలో భారత ఐటి కంపెనీల రాబడిలో వృద్ధి తగ్గిపోయింది. క్లయింట్ల సోర్సింగ్‌ వ్యూహాల్లో మార్పులు, డిజిటల్‌ రంగంలో పురోగతి నెమ్మదిగా ఉండటం కూడా దేశీయ కంపెనీల రాబడిలో వృద్ధిపై ప్రభావం చూపుతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ ఏడాదిలో ఐటి బడ్జెట్లు, డిమాండ్‌ ఔట్‌లుక్‌, డిజిటల్‌ వ్యయాల్లో పురోగతి, డిజిటల్‌ సర్వీసుల పారిశ్రామికీకరణ వంటి అంశాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.