న్యూఢిల్లీ: లండన్ నుంచి ముంబై వస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు పైలట్లు కొట్లాటకు దిగారు. ఇద్దరు పైలట్ల మధ్య సఖ్యత కుదరక విమానం కాక్‌పిట్‌లో గొడవకు దిగినట్లు జెట్ ఎయిర్వేస్ సంస్థ వెల్లడించింది. పైలట్ల ఘర్షణ విషయాన్ని తెలుసుకున్న జెట్ ఎయిర్వేస్ ఇద్దరి లైసెన్స్‌లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొడవ జరుగుతుండగా మహిళా కో- పైలట్‌ను పైలట్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. పైలట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. జెట్ ఎయిర్వేస్ విమానం లండన్ నుంచి ముంబై రావడానికి 9 గంటల సమయం పడుతోంది. జెట్ ఎయిర్వేస్ విమానంలో 324 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్లు ఘర్షణకు దిగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ల మధ్య గొడవ సద్దుమనగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జనవరి 1న ఈ సంఘటన చోటు చేసుకుంది.