ADVT
రూ.34 కోట్ల లాటరీ తగలడంతో ఆమె ఏం చేసిందంటే!
03-01-2018 23:28:47
డబ్బు జీవితాలను మార్చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. లక్ష్మీదేవి కటాక్షిస్తే జీవన శైలి మారిపోతుందనడానికి ఇదే నిదర్శనం. హల్‌లో నివసిస్తున్న మెలిసా ఏడే (57)కు నేషనల్ లాటరీ గేమ్‌స్టోర్‌ నిర్వహించిన లాటరీలో రూ.34 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె తన ట్రాన్స్‌జెండర్ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. తన ప్రేయసి రాచెల్ నేసన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తన జీవిత చరిత్రను ఓ పుస్తకంగా రాయబోతోంది.
విల్లర్‌బైలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మెలిసా మాట్లాడుతూ ఇదంతా ఓ కలగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది తాను పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ వేడుకను మామూలుగా జరుపుకోనని, చాలా అద్భుతంగా జరుపుకుంటానని తెలిపింది. తన ప్రేయసి గురించి మురిసిపోతూ చెప్తూ ఆమెను కలిసిన మరుక్షణమే ఫొటో క్లిక్ చేసినట్లు తెలిపింది. ఆమెను కలిసిన తొలి క్షణమే ఆమె నాకు కావాలనిపించిందని చెప్పింది. తామిద్దరం ఒకేలా ఆలోచిస్తామని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో కూడా తాము దాదాపుగా ఒకేవిధంగా పోస్ట్‌లు పెడుతూ ఉంటామంది. తమ పుట్టిన రోజు కూడా ఒకే రోజు అని, కొద్ది గంటల తేడాతోనే తాము జన్మించామని చెప్పింది. తనలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తాను సహాయపడాలనుకుంటున్నట్లు చెప్పింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.