శ్మశానంలో శవం తగలబడుతుండగా పిడిగుద్దులు...
03-01-2018 23:17:16
గ్లాస్గోలోని క్రెయిగ్‌టన్ శ్మశానంలో దారుణం జరిగింది. అంత్యక్రియలు జరిపేందుకు వెళ్లినవారిపై గుర్తు తెలియని వ్యక్తులు పిడిగుద్దులు కురిపించారు. ఓ వ్యక్తి మరీ ఘోరంగా వ్యవహరించాడు. పొడవాటి కర్రతో మిగిలినవారిని కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
అంత్య క్రియలు జరిపిన తర్వాత తిరిగి వెళ్ళేటపుడు ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి కర్రతో కొందరిని కొట్టాడు. ఆ తర్వాత దాదాపు 30 మంది వ్యక్తులు శ్మశానంలో కొట్టుకుంటూ, పెడబొబ్బలు పెడుతూ అత్యంత నీచంగా ప్రవర్తించారు. ఒకరిపై మరొకరు అరుచుకుంటూ, కొట్టుకున్నారు. సోషల్ మీడియాలో దీనిని చూసినవారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతాపంతో మౌనం ఉంటూ, మరణించిన వ్యక్తి ఆత్మ శాంతికి ప్రార్థించవలసినవారు ఇలా కొట్టుకోవడమేమిటని అసహ్యించుకుంటున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.