ADVT
ట్యాక్సీ డ్రైవర్‌కు రూ.211 కోట్ల జాక్‌పాట్
03-01-2018 23:09:37
ఓ ట్యాక్సీ డ్రైవర్‌ ఇంటి తలుపును అదృష్ట దేవత తట్టింది. రూ.211 కోట్లు లొట్టో జాక్‌పాట్ రూపంలో అనుగ్రహించింది. దీంతో ఆయన తన ట్యాక్సీకి బదులు ఫెర్రారీ కొనాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ ఉన్న ఓ భవంతిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు.
అమో రిసెల్లి (50) గ్లూసెస్టర్ నివాసి. ఆయన భార్య గుండెపోటుతో నాలుగేళ్ళ క్రితం చనిపోయింది. ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. లొట్టో జాక్‌పాట్‌లో గత బుధవారం ఐదు నంబర్లు కలవడంతో ఆయనకు రూ.211 కోట్లు వచ్చింది.
రిసెల్లీ మాట్లాడుతూ తనకు తల్లి మారియా (80), ఐదుగురు కుమార్తెలు, నలుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తొమ్మిది మంది మనుమలు ఉన్నారని తెలిపారు. తనకు లాటరీలో వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని వీరందరికీ పంచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను రిటైర్ అవ్వాలనుకుంటున్నానని, తన స్నేహితులతో హాయిగా నవ్వుకునే అవకాశాన్ని కోల్పోబోతున్నానని చెప్పారు. నాలుగు బెడ్రూములు, స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇంటిని కొంటానన్నారు. తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటానని చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.