దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు జరిగే ఆస్కారమే లేదు: మంత్రి మాణిక్యాలరావు
03-01-2018 22:26:27
అమరావతి: దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు జరిగే ఆస్కారమే లేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అంతరాలయాన్ని శుద్ధి చేయడం.. అలంకరణ వరకే జరిగిందని ఆయన తెలిపారు. బయట వ్యక్తులు ఆలయంలోకి రావడం అభ్యంతరకరమే అని అన్నారాయన. రాష్ట్రపతి భార్య వస్తున్నారని అమ్మవారిని సుందరంగా..అలకరించేందుకే బయట వ్యక్తులను బద్రీనాథ్‌ తీసుకొచ్చారని ఆయన వివరించారు. పూర్తి స్థాయి విచారణ కోసం దేవాదాయ శాఖ తరపున నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నామని మంత్రి చెప్పారు.
పోలీసుల విచారణ కూడా జరుగుతోందన్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగితే సహించమని ఆయన మండిపడ్డారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.