‘గజల్ శ్రీనివాస్‌ ఎపిసోడ్‌లో కుట్ర కోణం ఉంది’
03-01-2018 22:15:35
విజయవాడ: గజల్ శ్రీనివాస్‌ ఎపిసోడ్‌లో కుట్ర కోణం ఉందని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అనుమానం వ్యక్త చేశారు. మహిళను లైంగికంగా వేధించిన గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మంత్రి మాణిక్యాలరావు గజల్ శ్రీనివాస్ తనకు చిన్నప్పట్నుంచి తెలుసు అని చెప్పారు. అమ్మాయిలను వేధించే నైజం గజల్ శ్రీనివాస్‌ది కాదని అన్నారు. కుట్ర లేకుంటే కెమెరాలు ఎందుకు పెట్టారని మాణిక్యాలరావు ప్రశ్నించారు.
Tags : ap minister, manikyala rao, Responded, gajal srinivas, massage
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.