ఐపీఎల్-11: ఆర్‌సీబీకి కఠిన నిర్ణయం.. గేల్‌కు ఎదురుదెబ్బ!
03-01-2018 21:29:37
బెంగళూరు: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఈ సీజన్‌లో తమ జట్టుల్లో కొనసాగే ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీలు రేపు పాలకమండలికి నివేదిక అందించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి తమ వద్ద అట్టిపెట్టుకొనే అటగాళ్ల వివరాలను జట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. అయితే గత ఏడాది చెత్త ప్రదర్శనతో టేబుల్‌లో ఆఖరిస్థానంతో సిరీస్‌ను ముగించిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే పాత బ్యాటింగ్‌, బౌలింగ్ కోచ్‌లను తొలగించి వాళ్ల స్థానంలో గ్యారీ కిర్‌స్టన్, అశీష్ నెహ్రాలను కోచ్‌లుగా నియమించుకుంది. తాజాగా ఆటగాళ్ల ఎంపికలోనూ ఆర్‌సీబీ కఠిన వైఖరిని అవలంభిస్తోంది. తమ వద్ద అట్టిపెట్టుకొనే ఆటగాళ్లలో ఈసారి విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌కు అవకాశం కల్పించలేదు. కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చహాల్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు ఆర్‌సీబీ ప్రకటించింది. గత ఏడాది ఐపీఎల్‌లో విఫలమైనప్పటికీ టీం ఇండియాలో విరాట్, చహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మరోవైపు సపారీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జట్టులో కీలక ఆటగాడు దీంతో వీరిని కచ్చితంగా అట్టిపెట్టుకొని గేల్‌ విషయంలో మాత్రం ఆసక్తికనబరచలేదు. అయితే గేల్ ఆర్‌టీఎం ద్వారా తన స్థానాన్ని నిలుపుకొనే అవకాశంది లేకుంటే ఇక గేల్ ఐపీఎల్ భవితవ్యం త్వరలో జరగబోయే వేలంలోనే తేలనుంది.
Tags : Chris Gayle, IPL
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.