మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్!
03-01-2018 21:09:57
నాగర్‌కర్నూల్‌: మద్యం తాగొద్దని ప్రజలకు హితవు చెప్పే పోలీసులే మద్యానికి బానిసైతే..? మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసులే పబ్లిక్ చేత కౌన్సింగ్ ఇప్పించుకుంటే..? నాగర్‌కర్నూల్‌లో బుధవారం ఇదే జరిగింది. ప్రజలు మద్యం తాగకుండా ఉండేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఎన్నో చర్యలు తీసుకుంటుండగా.. కొందరు పోలీసులు మాత్రం పట్టపగలే తప్పతాగి.. పబ్లిక్‌గా హల్‌చల్ చేస్తూ పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్లే.. నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణ.. బుధవారం ఫుల్లుగా మద్యం తాగాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపైకి వచ్చి.. వాహనదారులను ఇష్టమొచ్చినట్లు దూషించాడు. దీంతో ఆగ్రహించిన కొందరు వాహనదారులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేశారు. అయితే కానిస్టేబుల్ వీరంగాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.