ADVT
సఫారీలు క్లీన్‌స్వీప్ చేసినా.. భారత్ ర్యాంకు పదిలమే..!
03-01-2018 21:03:47
కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 5నుంచి తొలి టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇరు జట్ల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు విరాట్ సేన, సఫారీలు పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రథమస్థానంలో భారత్, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి. దీంతో రెండు టాప్ జట్ల మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌పై ఇరు దేశాల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త భారత అభిమానుల్ని కలవరానికి గురి చేసింది. ఈ సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంటే భారత్ నెం.1 స్థానాన్ని కోల్పోతుంది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన సరే భారత్ ర్యాంకు పదిలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ 124 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 13 పాయింట్లు వెనుకబడి 111 పాయింట్లతో రెండు స్థానంలో ఉంది. అయితే ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంటే 117.53 పాయింట్లు సాధించగా.. భారత్ 118.47 పాయింట్లకు పడిపోతుంది. దీంతో భారత తన స్థానం కోల్పోయే అవకాశం లేదు. మరోవైపు ఒకవేళ భారత్ విజయం సాధిస్తే.. 128 పాయింట్లకు ఎగబాకుతుంది. సౌతాఫ్రికా మాత్రం 4 కోల్పోయి 107 పాయింట్లకు పడిపోతుంది. కాబట్టి ఈ సిరీస్‌లో భారత్ గెలిచినా.. ఓడినా.. నెం.1లోనే ఉంటుంది.
Tags : India VS South Africa, Cricket, ICC rankings

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.