ADVT
విజయవాడ పుస్తక మహోత్సవంలో అభిమానుల ఆందోళన
03-01-2018 20:20:35
విజయవాడ: విజయవాడ పుస్తక మహోత్సవంలో భాషాభిమానులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రాతలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా తెలుగు తల్లి పాట పాడిన తర్వాతే పుస్తకావిష్కరణ జరగాలని ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రచనలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనికి ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకావిష్కరణ చేసుకోవాలని భాషాబిమానులు స్పష్టం చేశారు.
 
స్కైబాబా రాసిన పుస్తకానికి సంబంధించి తాము ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంలేదని, కానీ ఉద్యమ సమయంలో స్కైబాబా ఆంధ్రులను ఉద్దేశించి ఆయన రాసిన అసభ్యకర రచనలపై ఆయన ఇక్కడ అందరిముందు బహిరంగ క్షమాపణ చెప్పి, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాట పాడిన తర్వాతనే ఆయన తన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని అన్నారు. ‘‘ఆరే ఆంధ్రుడా నంగినంగి వేషాలు వద్దు, నక్కతలుపులు ఇకపై చూపెట్టొద్దు, బెజవాడకు మెయిలు కడతాం, బద్మాష్‌లంతా బదాయించాలి’’ ఇలా ఆయన రాసిన కొన్ని అసభ్యకర రచనలను వారు చదివి వినిపించారు. తమకంటూ ఆత్మగౌరవం ఉందని, స్కైబాబా సభా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
Tags : Book, inagurates, sky baban

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.