ADVT
మొబైల్ నుంచే ఆధార్ లింక్ చేయొచ్చు..
03-01-2018 20:18:07
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లకు ఆధార్‌లింక్‌ను కేంద్రప్రభుత్వం సులభతరం చేసింది. ఐవీఆర్‌ఎస్ పద్ధతి ద్వారా మొబైల్ నుంచే అనుసంధానం చేసేలా డయల్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్‌టెల్, ఐడియా, జియో, వొడాఫోన్, ఏ నెట్ వర్క్ నుంచైనా 14546 డయల్ చేయాలి. కస్టమర్‌ది ఇండియా అయితే ఒక ఆప్షన్, ఎన్నారై అయితే ఇంకో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 12 నెంబర్లు గల ఆధార్ నెంబర్‌ను పొందుపర్చాలి. వెంటనే ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌కు ఓ వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) మెసేజ్ వస్తుంది. ఈ ఓటీపీని ఐవీఆర్‌ఎస్‌కాల్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం ఆధార్‌పై ఉన్న పేరు, మొబైల్ నెంబర్‌, పుట్టిన తేదీ‌ని నమోదు చేయాలి. ఆధార్ నెంబర్‌ని మరోసారి పరిశీలించుకునేందుకు చివరి నాలుగు అంకెలు మనకు వినిపిస్తాయి. కరెక్టే అనిపిస్తే 1 నొక్కాలి. కాదు అనిపిస్తే మళ్లీ మొదటికి రావాలి. ఈ ప్రక్రియ 48 గంటల తర్వాత పూర్తి అవుతుంది. అప్పుడు ఆధార్ లింక్ అయినట్లు. ఒకవేళ మరో సిమ్ కలిగి ఉంటే 2 అనే ఆప్షన్‌ను ఎంచుకొని మళ్లీ ఎంటర్ చేసుకోవాల్సిందే.
Tags : Mobile, aadhar link

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.