తమ వివాహబంధాన్ని మెడలో వేసుకున్న విరాట్!
03-01-2018 20:12:00
కేప్‌టౌన్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మపై తనకు ఎంత ప్రేమ ఉందో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం కేప్‌టౌన్‌లో ఉన్న విరాట్ తమ వివాహబంధానికి గుర్తైన వెడ్డింగ్ రింగ్‌ను మెడలో వేసుకొని కనిపించాడు. దక్షిణాఫ్రికాతో ఈ నెల 5 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో విరాట్ తన టీంతో విస్తృతంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ విరాట్‌ను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో పాటు విరాట్ దిగిన ఫోటోలో విరాట్ మెడలో ఓ గొలుసుకు ఉంగరం ధరించి కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు విరాట్ తన భార్యపై చూపుతున్న ప్రేమను అభినందిస్తు కామెంట్ చేస్తున్నారు.
Tags : Virat kohli, WEDDING, India VS South Africa
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.