ADVT
‘‘గొడవ చేసేందుకే వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారు..’’
03-01-2018 19:51:28
అమరావతి: పులివెందుల జన్మభూమి కార్యక్రమంలో గొడవ చేసేందుకే వైఎస్ అవినాష్‌రెడ్డి వచ్చారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం పులివెందులలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు, అవినాష్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదంపై స్పందించిన బుద్దా వెంకన్న... ఎంపీ అవినాష్‌పైనా, వైసీపీ అధినేతపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందులకు నీళ్లు ఇస్తుంటే జగన్‌ అడ్డుకోవాలని చూస్తున్నారని నిప్పులుచెరిగారు. పోతిరెడ్డిపాడు, గండికోట ప్రాజెక్టుల కాలువలను వెడల్పు చేసి.. రైతులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పులివెందులలో టీడీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు.
Tags : ys avinash reddy, budha venkanna, pulivendula

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.