ADVT
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...
03-01-2018 19:40:47
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస జీవులను రోడ్డు ప్రమాదం బలిగొంది. చిన్నహుల్తీ దగ్గర లారీ బోల్తాపడడంతో ఏడుగురు మృతి చెందారు. మృతులు హోళగుంద మండలం, కొత్తపేటకు చెందినవారుగా గుర్తించారు. దీంతో కొత్తపేటలో విషాదం అలుముకుంది. కూలి పనుల కోసం నల్గొండకు వలస వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
మృతులు: హనుమంతమ్మ(18), బోయ గోవిందమ్మ(45), ఈరమ్మ(45), బోయ నరసమ్మ(40), బోయ సేకమ్మ(45) స్రవంతి(16), నారాయణ(40). మృతుల్లో నారాయణ, స్రవంతి తండ్రీకూతుళ్లని, షేకమ్మ, దర్గమ్మ అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags : Accident, kurnool

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.