ADVT
అందుకే ధైర్యంగా ముందుకొచ్చా..: గజల్ బాధితురాలు
03-01-2018 19:21:46
హైదరాబాద్: గజల్ శ్రీనివాస్ నిజస్వరూపం బయట పడాలనే ధైర్యంగా ముందుకు వచ్చానని బాధితురాలు అరుణ కుమారి పేర్కొంది. గజల్ శ్రీనివాస్ ఎంత దారుణంగా ప్రవర్తించేవాడో.. ఆ విషయాలను బాధితురాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించింది. గజల్ శ్రీనివాస్‌లో రెండు కోణాలు ఉన్నాయని, ఒకటి సమాజానికి తెలిసి ఒక ముసుగని, రెండోది సమాజానికి తెలియని మరో వ్యక్తిత్వం ఉందని తెలిపింది. అమ్మాయిలు అంటే కేవలం ఆయన దృష్టిలో కోరిక తీర్చేది మాత్రమేనని, ఆయనకు ఒక కుమార్తె ఉందన్న విచక్షణ కూడా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గజల్‌కు ఆఫీసులో ఒక బెడ్‌రూం ఉందని, మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చి పడుకుంటారని, ఆ సమయంలో నీచ కార్యకలాపాలు సాగిస్తారని బాధితరాలు తెలిపింది.
 
ఆఫీసులో జరిగే కార్యక్రమాలు గమనించి, ఇక్కడ వాతావరణం బాగోలేదని తాను వెళిపోతానని చెప్పగా... వెళ్లిపోతే ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇవ్వనని, ఎక్కడ ఉద్యోగం చేయనివ్వనని గజల్ శ్రీనివాస్ బెదిరించారని బాధితురాలు తెలిపింది. ఆయనకు భుజం నొప్పి, ఫిజియోథెరపీ లాంటిదేమీ లేదని ఆమె చెప్పింది. తనపై గజల్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, గజల్ చేసిన దారుణానికి సంబంధించిన అన్ని వీడియోలు ఆధారాలతో సహా పోలీసులకు అందజేశానని బాధితురాలు స్పష్టం చేసింది. పార్ అనే మహిళ తనను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసిందీ.. ఆ వీడియో క్లిప్పుంగులు కూడా ఇచ్చానని, ఆధారాలు సంపాదించడం కోసమే గజల్ కాళ్లు పట్టుకున్నానని, అంతకుమించి ఇంకేమీ చేయలేదని ఆమె తెలిపింది. ఇటువంటి దుస్థితి ఇంకో మహిళకు రాకూడదనే ఉద్దేశంలో ఆధారాలతో సహా పోలీసులకు పిర్యాదు చేశానని బాధితురాలు అరుణ కుమారి వెల్లడించింది.
Tags : Ghazal Srinivas, victim, aruna kumari, ABN, Hyderabad

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.