ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం...
03-01-2018 18:13:18
పులివెందుల: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడడం సరికాదని అన్నారు. వైఎస్ హయాంలో గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తి అయ్యాయని అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం చేసింది 15 శాతం పనులేనని ఆయన అన్నారు. దీంతో జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడవద్దని చంద్రబాబు ఆయనకు సూచించారు. ఇది ప్రజా సభని, ఇక్కడ ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదని, ఎవరి సభలు వారికుంటాయని, అక్కడ మాట్లాడుకోవాలని, ఇక్కడ గౌరంగా సమావేశం జరగాలని సీఎం అన్నారు. ఈ ప్రాంతానికి ఇవాళ నీరు ఇచ్చింది తానని, ఈ విషయం కూడా ఇక్కడ చెప్పలేదని, గౌరంగా ఉండడం నేర్చుకోవాలని అవినాష్ రెడ్డికి చంద్రబాబు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలని, పరిష్కరిస్తానని చెప్పారు.
 
పులివెందులలో జరిగిన జన్మభూమి సభకు ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు పిలిచారు. మొదట మైకు ఇవ్వకపోవడంతో అవినాష్ అనుచరులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు అవినాష్‌కు మైకు ఇచ్చారు. మైకు ఇచ్చే ముందు రాజకీయాలు మాట్లాడవద్దని, కేవలం సమస్యలపైనే మాట్లాడాలని చెప్పారు. అయినా అవినాష్ రాజకీయాలు మాట్లాడారు. ఇవాళ ఇక్కడ సీఎం ప్రారంభించిన గండికోట, చిత్రవాతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు చేసిన పనికాదని, గతంలోనే వైఎస్ ప్రారంభించి 85 శాతం పనులు పూర్తి చేశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం 15 శాతం మాత్రమే పనులు చేసిందని ఆయన అన్నారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదని అన్నారు. దీంతో అవినాష్ రెడ్డి వెనక్కి తగ్గారు.
Tags : Chandrababu, avinash reddy, janmabhoomi, pulivendula
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.