చెమట చిందించే రోబో!
03-01-2018 02:02:11
టోక్యో, జనవరి 2: రోబో శరీరమంతా లోహమే. శరీర భాగాలన్నీ వైర్లు, చిప్‌లు, సర్క్యూట్లతో నిండి ఉంటాయి. అలాంటిది వాటికి చెమట వస్తుందా? రాదు. కానీ, జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో శాస్త్రవేత్తలు తయారు చేసిన ‘కెంగోరో’ అనే రోబో స్వేదం చిందిస్తుందట. కృత్రిమ స్వేద వ్యవస్థను కలిగిన ఈ రోబో వ్యాయామం చేసినపుడు మనిషిలాగే చెమట విడుదల చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ రోబో అథ్లెట్లు, క్రీడాకారుల కండరాల విశ్లేషణకు పనిచేస్తుందని వెల్లడించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.